సౌందర్యము అనునది ఒక కల్యాణ గుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్ధానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణ గుణములతో పరి పూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణ మగును. ఆది శంకరుల మనస్సు అంతయు బ్రహ్మజ్ఞానముతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము ఎంతో సుందరముగా బ్రహ్మవర్ఛస్సుతో నిండియున్నది. అట్లే కృష్ణుని మనస్సు ప్రేమతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము నందున షోడశ కళలు తాండవించుచుండును. రాముని మనస్సు శాంతితో నిండియున్నది. కావున ఆయన మనస్సు ప్రసన్నముగా ఎంతో కోమలముగా యుండును. బుద్ధుని మనస్సు కరుణతో నిండియున్నది. కావున ఆయన ముఖము నందు అమృతము చిందు చున్నది. ఈ విధముగా ఆత్మ సౌందర్యము బాహ్య సౌందర్యమునకు కారణమై యున్నది. దేహముతో పాటు బాహ్య సౌందర్యము నశించుచున్నది. కాని ఆత్మ సౌందర్యము జీవాత్మను ఆశ్రయించి నిత్యముగా యుండుచున్నది. ఈ గుణములను బట్టియే ముఖములో కళలు ఉండుచున్నవి. కావుననే ముఖమును బట్టియే గుణములు చెప్పుట వచ్చి యున్నది. కావున కల్యాణ గుణములలో ఒకే ఒక్క గుణము అగు సౌందర్యము దేహమును ఆశ్రయించి ఉన్నది. మిగిలిన కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు. ఈ కల్యాణ గుణములు వాక్కు నందు కూడ ప్రతిబింబించు చుండును. కావున పరమాత్మ యొక్క వాక్కు ఎంతో సుందరముగా యుండును. భగవద్గీతా శ్లోకముల యొక్క సౌందర్యము ఏ శ్లోకములకు లేదు. శ్రీ కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారము. కావున ఆయన మనస్సుతో సమానమైన ఆత్మ సౌందర్యము ఎచ్చటను కనుపించుట లేదు. అట్లే ఆయన వాక్కులగు భగవద్గీతా సౌందర్యము కూడా ఏ వాక్కులకును గోచరించదు. అదే విధముగా ఆయన రూపముతో సమానమైన బాహ్య సౌందర్యము ఎచ్చటను కనిపించదు. శరీరము యొక్క సౌందర్యము, ఆత్మ సౌందర్యము యొక్క గుణములు, ఆహారము మీద కూడా ఆధారపడి యుండును. సాత్వికాహారము తేజస్సును ప్రసాదించును. శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును సాత్వికాహారమగు పాలు, పెరుగు, వెన్న భుజించెడివాడు. ఆయన మాంసాహారమును ఎప్పుడును అంటలేదు. కావుననే భగవద్గీతలో సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగించు ఆహారమును గురించి స్వామి వివరించినాడు. సాత్వికాహారము సత్వగుణమును పెంచి తేజస్సును పెంచి బాహ్య సౌందర్యమును ఆత్మ సౌందర్యమగు కల్యాణ గుణములను వృద్ధి చేయును.
శ్రీ దత్త భగవానుడును ఎల్లప్పుడును గోక్షీరమునే స్వీకరించెడివాడు. కావున ఆయన ముఖమునందు బ్రహ్మవర్ఛస్సు ఒక సముద్రము వలె ఉప్పొంగు చుండెడిది. సత్వము జ్ఞాన కారకము కనుక ఆయన కున్న జ్ఞానము ఎవరికి ఉండెడిది కాదు. దత్తుని యొక్క వాక్కు ఎంతో మాధుర్యముతో నిండి కోటి వీణలు మీటినట్లుండును. కావున ఆహారము దేహము యొక్క రూపమునకు వాక్కుల యొక్క పద్ధతికి గుణములకు ఎంతో ముఖ్యమైనది. సాత్వికాహారముతో పాటు యోగము కూడ యుండవలెను. ఇది ఆహారము కన్నను ముఖ్యము. యోగము అనగా ఎల్లప్పుడును భగవంతుని గురించిన భావములు, వాక్కులు, క్రియలు ఉండుట. దీనిచే ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల మీద అందరు వ్యక్తుల మీద బంధము తెగిపోవును. లోకములో వ్యక్తుల మీద వస్తువుల మీద బంధములే అన్ని చింతలకు కారణము. కాలిన ఇనుప కడ్డీని పట్టుకుని చేయి బోబ్బలెక్కుచున్నదని పామరుడు కేకలు పెట్టును. అతడు ఇనుప కడ్డీ వేడిని తీసివేయమనియు, లేక తన చేతికి బోబ్బలు రాకుండా చేయమనియు భగవంతుని ప్రార్ధించుచున్నాడే తప్ప, ఆ ఇనుప కడ్డీని వదల లేకుండా యున్నాడు. ఇనుప కడ్డీ నుండి వేడిని తీసివేయుట లేక చేతికి బోబ్బలు ఎక్కకుండా చేయుట ఎంత కష్టము. ఇనుప కడ్డీని వదలి వేయుట ఎంత సులభము. సులభమైన పనులు చేసి చేయి కాలకుండా చేసుకొనుట జీవుడే స్వయముగా చేయవలయును. ఒక పని సులభముగా చేయు అవకాశముండగా భగవంతుని కష్టపెట్ట నేల? భగవంతునికి కష్టము కాదు అందురా? ఆ కష్టము కాని పనిని జీవుడే చేయవచ్చును గదా? అయితే ఈ లౌకిక బంధములను తెంచుకొనుట చేతకాక యున్నది అని జీవుని వాదము. అసలు జీవుడు ఏ ప్రయత్నము చేయకయే ఈ లౌకిక బంధములు సులభముగా తెగిపోవు ఏకైక మార్గము గలదు. అదే యోగ శాస్త్రము. దానికి అధినాధుడే శ్రీ దత్తాత్రేయుడు. అది ఏమి అనగా నీవు నీ మనో వాక్కాయ కర్మలన్నింటిని భగవత్పరము చేయుము. నీవు భగవంతుని మాధుర్యము రుచి చూడగనే ఈ లౌకిక బంధము లందు ఎట్టి ప్రయత్నము లేక స్వయముగనే నశించును. అమృతము త్రాగిన వాడు కాఫీని స్వయముగనే వదలివేయును. అప్పుడు కాఫీని వదలి వదలివేయుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. అమృతము రుచి చూడకుండా కాఫీని వదలుట అసంభవము. కావున భగవద్ యోగమునకు ప్రయత్నించుము. ఈ యోగము సిద్ధించిన వైరాగ్యము ప్రయత్నము లేకయే సిద్ధించుచున్నది. లౌకిక బంధములు తెగిపోయినచో నీకు ఎట్టి చింతలు ఉండవు. ఈ చింతయే ఒక మహాగ్ని. అగ్నిలో కాలిన వాడు బాహ్య సౌందర్యమును కోల్పోవును. చింతలో కాలిన వానికి ముందు ఆత్మ సౌందర్యము కాలిపోయి, దాని ప్రభావము చేత బాహ్య సౌందర్యము కూడ నశించును. కావున లౌకిక బంధములలో ఉండుచు యోగము ద్వారా చింతలు అను మంట అంటకుండ మెలుగు వాడే యోగి, అట్టి యోగియే పరమ సుందరుడు. ఈ లోకములో పరమ సుందరుడు ఎవరు అనగా హనుమంతుడు. అందుకే ఆయనను గురించిన కాండకు సుందరాకాండ అని పేరు వచ్చినది. ఆ కాండలో ప్రతిక్షణము క్లిష్టమైన సమస్యలలో హనుమంతుడు చిక్కుకుంటాడు. కాని ఆయనను ఏ చింత మంట అంటలేదు. ఇదే హనుమంతుని తోకకు అగ్ని అంటించిననూ ఆయన కాల లేదు అను ఘట్టములోని అంతరార్ధము. భగవద్గీతయను యోగ శాస్త్రమంతయును ఆత్మ సౌందర్యము, మరియు బాహ్య సౌందర్యములను కాపాడుకొను మార్గమే. సౌందర్య ఆది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు బోధించి యున్నాడు. కావున ఆయనను సత్యం, శివం, సుందరం అన్నారు.
At the lotus feet of Shri Datta swami
-Durgaprasad
'అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును' అంటారు స్వామి. భక్తులు స్వామిని దత్తావతారముగా గుర్తించి విశ్వసిస్తున్నారు. స్వామి ప్రసాదించిన అనేక దివ్య ఉపన్యాసాలను ఈ బ్లాగు ద్వారా పొందగలరు. ఈ దత్తసేవలో పాల్గొని ఇతర భక్తులు కూడా శ్రీ దత్త ప్రభువుల యొక్క అనుగ్రహమును, ఆశీస్సులను పొందుదురుగాక! స్వామి గారి భజనల కొరకు BHAKTIGANGA లింక్ చూడండి.
Saturday, October 9, 2010
Saturday, October 2, 2010
All scriptures say "Sacrifice of fruit of work (money) is the highest"
The scriptures say that your sacrifice of money is highest.
1) In the very beginning itself (second Adhyaya), Gita says that the fruit of the work must be sacrificed (Karmajam Buddhi Yuktahi Phalam Tyaktva Maneeshinah). This means that realized scholars sacrifice the fruit of the work. Gita keeps sacrifice of the fruit of the work on the top most level. Gita says ‘Jnanat dhyanam visishyate, Dhyanat Karma Phala Tyagah’i.e., Bhakti (devotion) is better than Jnana (knowledge) and sacrificing the fruit of your work (money) is better than Bakthi.
2) Gita says ‘Sarva karma Phala tyagam prahus tyagam vichakshanah’ i.e., if you can give the fruit of the entire work to the Lord, then that is real sacrifice.
3) ‘Na karmana, Na prajaya, Dhanena tyagenaike Amritatvamaanasuh’ i.e., you cannot attain God by selfish work or the children. You can attain God only by sacrificing your money for God’s work. – The Veda
4) The first words of the first Upanishath (Easavaasyam) says, ‘Tena tyaktena Bhunjeedah’ ‘Ma gradha ha kasyasvit Dhanam’ i.e., this entire world is the money of the Lord. Take whatever you require from His wealth; don’t take extra which is not permitted by the God. If you have taken, you are a thief. Return it back to the Lord.
5) Veda says ‘Samvidha’ ‘Shraddhayaa’ ‘Hriya’ ‘Bhiya dheyam’, i.e., return the extra to the Lord in human form after recognizing Him through His Jnana. Wait patiently till you recognize the Lord in human form. When you are donating your money to Him (actually you are giving Him His own money) you should give it with fear and feel shy.
6) In Yoga Vasistha the Guru Vasista says to Rama (Dhanamarjaya) i.e., bring money and offer it to me as Guru Dakshina before I can teach you the Jnana.
7) Shirdi Sai used to ask Guru Dakshina from everybody to teach this important sacrifice. He criticized a merchant who came for Brahma Jnana but was not giving even Rs.5/- from his pocket. Mr. Patil, a farmer used to donate the entire yearly crop to Baba and took back whatever Baba gave back to him.
8) In bible:
Matthew–6 : 19 to 22
‘Do not Lay up for yourselves, treasures on earth. But lay up for yourselves treasures in heaven. For where your treasure is there your heart will be also’.
Matthew -7: 21
‘Not everyone who say to Me, ‘Lord, Lord’ shall enter the kingdom of heaven, but He who does the will of My Father in Heaven’.
9) In islam:
Holy Islam speaks about the sacrifice of fruit of work (money) through the word ‘Jakaat’. This word says that every rich man is expected to practice the sacrifice within the limit of his wealth. Islam says that people are loving too much the money (Q’ran: AalFajr – 20). Islam says that by sacrifice of money your wealth will not decrease and in fact your wealth increases by sacrifice. Islam also mentions that by sacrifice of money your wealth becomes most pure.
At the lotus feet of Shri Dattaswami
-durgaprasad

Subscribe to:
Posts (Atom)