Wednesday, September 30, 2009

అవతారపురుషుడు

పరమాత్మ అద్వితీయునిగా ఏకాకిగా ఉండెను. ఆ పరమాత్మ స్వరూపము పరమాత్మకే తెలియును. "బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. దీని అర్ధము బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మమే అని. బ్రహ్మమును గురించి బ్రహ్మము కన్న భిన్నులైన ఇతరులు అనగా జీవులు ఏ మాత్రము తెలియజాలరు. కాని శ్రుతిని తప్పుగా సమన్వయము చేయుచున్నారు. బ్రహ్మమును గురించి ఏ జీవుడు తెలుసుకొన్నను ఆ జీవుడు బ్రహ్మమగును అను అర్ధమును చెప్పుచున్నారు. ఇది సరియైన అర్ధము కానేకాదు. ఏలననగా, బ్రహ్మము వాక్కులకు గాని, కన్నులు మొదలగు ఇంద్రియములకు గాని, మనస్సుకు గాని, బుద్ధికి కాని, తర్కమునకు గాని అందదు. శ్రుతులు "యతోవాచః, నచక్షుషా, అప్రాప్య మానసా, నమేధయా, నైషతర్కేణ" అను శ్రుతులు ఇందుకు ప్రమాణములు. “మాన్తు వేదన కశ్చన” అని గీతలో నున్న ఏ జీవుడును తెలియజాలడు అని స్వామి వచించినాడు. దీనికి కారణము జీవుల ఊహలన్నియు ఆకాశ తత్త్వము వరకే వ్యాపించగలవు ఆకాశమనగా ఖాళీ స్ధలము. ఆకాశామునకు అతీతమైన "ఆకాశః" అను శ్రుతి ప్రకారము ఆకాశమును సృష్టించిన పరమాత్మను ఏ జీవుడును, ఎప్పటికిని అర్ధము చేసుకొనజాలడు.ఆకాశము అదృశ్యమైనకాని, పరమాత్మ గోచరించడు. ఆకాశమే అదృశ్యమైనచో జీవుడు, జీవుడు యొక్క మేధాశక్తి, జీవుని ఊహలు అన్నియు అదృశ్యమైపోవును. కావున ప్రకృతి స్వరూపుడగు జీవుడు ప్రకృతి అంతయు అదృశ్యమైనపుడు మాత్రమే గోచరించు పరమాత్మను ఎంత ప్రయత్నించినను తెలియజాలడు. ఐతే పరమాత్మను తెలియజాలడు అను విషయము ఎట్లు తెలిసినది? తెలియలేని వస్తువు అసలు లేదనియు భావించవచ్చును గదా! ఈ ప్రశ్నకు శ్రుతి "అస్త్రీత్యేవోపలబ్ధః" అని చెప్పుచున్నది. దీనికి అర్ధము తెలియుటకు వీలుకాని తాను ఉన్నానని మనకు చక్కగా తెలియునట్లు చేయును. అది ఎట్లు అనగా అవతారము ద్వారా . అవతారము యొక్క ముఖ్యోద్దేశము ఇదే. ఇది పరమాత్మ చేయనిచో సర్వజీవులు నాస్తికులగుదురు. ఊహకు అందని కొన్ని పనులను అవతారము చేసి జీవులకు చూపించును. ఊహాతీతమైన పనుల ద్వారా ఊహాతీతమైన పరమాత్మ ఉన్నాడని ప్రత్యక్ష ప్రమాణము ద్వారా నిరూపించుటయే సిద్ధులను ప్రదర్శించుటలోని ముఖ్యోద్దేశము.

దీని వలన జీవులలో నాస్తికత్వము పోయి ఆస్తికత్వము నిలబడును. కావున నాస్తికుని మార్చుటకే ఈ సిద్ధులు. ఆస్తికునకు సిద్ధులు అక్కరలేదు. శ్రుతిలో అవతారమును గురించిన ప్రస్తావన లేదని త్రైతమత పండితులు వాదించుచున్నారు. కాని ఇది సరి కాదు. "అజాయమాన్తో బహుధా విజాయతే" అను శ్రుతి పుట్టుకలేని వాడు అనేక సార్లు పుట్టు చున్నాడు అనియు, “తత్‌ సృష్టా తదేవాను ప్రావిశతు” అను శ్రుతి పరమాత్మ ఈ జగత్తును సృష్టించి, ఈ జగత్తులోనికి ప్రవేశించుచున్నాడు చెప్పుచున్నది. ఈ అను ప్రవేశ శ్రుతికి కూడా కొందరు అపార్ధమును చెప్పుచున్నారు. వీరి ప్రకారము పరమాత్మ పంచ భూతములతో జడములను మాత్రమే సృష్టించినాడు. తరువాత తన స్వరూపమగు చైతన్య స్వరూపముతో జగత్తులోని జీవునిలో ప్రవేశించినాడు అని చెప్పుచున్నారు. ఇది సరికాదు ఏలననగా "ఆకాశాత్‌ వాయుః" ఇత్యాది శ్రుతులు మొదట ఆకాశము దాని నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి వృక్షములు, వృక్షముల నుండి జీవులు పుట్టినారని జీవుని పంచభూతముల వికారమగు అన్నము నుండి జీవుడు పుట్టుట చెప్పుచున్నది. జీవుడే పరమాత్మ అయినచో "అన్నాత్‌ పురుషః" అన్నము నుండి జీవుడు పుట్టినాడని శ్రుతి ఎట్లు చెప్పినది. కావున ఏకాకిగా వినోదము లేని పరమాత్మ ఈ జగత్తును తన ఊహారూపముగా సృష్టించినాడు అన్నప్పుడే జీవుల సృష్టి కూడా జరిగినది. ఆ సృష్టిని చూచి వినోదించి తృప్తి చెందక పరమాత్మ తానును ఒక జీవరూపమున ప్రవేశించినాడు అనియే అను ప్రవేశ శ్రుతికి అర్ధము చెప్పవలెను. మరియును గీతలో ప్రకృతి రెండు భాగములని చెప్పబడినది. ఒకటి జడమగు అపరా ప్రకృతి. రెండవది జీవుడు లేక చైతన్యమగు పరా ప్రకృతి. ప్రకృతి యనగా సృష్టి అని అర్ధము. పరా ప్రకృతి యనగా ఆయన సృష్టించిన పదార్ధములలో జీవుడు శ్రేష్టుడని అర్ధము.

ఈ విధముగా పరమాత్మ వినోదమను ప్రయోజనము ఒక్కటే కాక తన భక్త జీవులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను అనుగ్రహించి, వారిని తరింపచేయుటకై పరమాత్మ నిరంతరము జగత్తులో అవతరించుచునే ఉన్నాడు. పరమాత్మ అవతరించునప్పుడు మాతృ గర్భమున జడమైన శరీరము ఏర్పడును. ఈ శరీరములో ఎట్టి గుణములు లేని శుద్ధ చైతన్యము అగు జీవుడు వ్యాపించియే యున్నాడు. అయితే ఈ శుద్ధచైతన్యమును జీవుడని ఖచ్చితముగా చెప్పరాదు. జీవుడనగా కొన్ని గుణముల సమూహము. ఈ గుణ సమూహమగు జీవుడు పరమాణు ప్రమాణముతో తేజోబిందువుగా యుండను. ఈ జీవుడే యాతనా శరీరముతో పైలోకములలో కర్మఫలమును అనుభవించి మేఘము వర్షము భూమి యొక్క ధాన్యపుగింజ ద్వారా మాతృ గర్భమున ఏర్పడిన శుద్ధచైతన్య సహితమైన జడ శరీరము లోనికి ప్రవేశించుచున్నాడు. ఇక్కడ శుద్ధచైతన్యము కూడా జీవుని యొక్క స్వస్వరూపమే కావున జీవుడు అనవచ్చును గాని ఈ శుద్ధ చైతన్యము చేతన అను శబ్ధముతో పిలవబడుచున్నది. పరమాత్మ అవతరించినపుడు శుద్ధచైతన్యముతో కూడిన జడశరీరము లోనికి పరమాత్మయే ప్రవేశించును. గుణ సమూహమగు జీవుడు ప్రవేశించడు. కావున అవతారపురషునకు ఎట్టి గుణ సమూహము లేనందన నిర్గుణుడై కర్మఫలములనంటక ఉండును.

భక్తుడు: భక్తుడు అనగా తన కర్మఫలములను స్వామి అనుభవించునని తెలిసి వాటిని తానే అనుభవించెదననియు వాటిని స్వామి రద్ధు చేయవద్దు అని ప్రార్ధించెడివాడు. రద్దు చేయుట అనగా స్వామియే స్వయముగా అనుభవించుట అని తెలిసినవాడే నిజమైన భక్తుడు. అజ్ఞానియగు భక్తుడు కర్మఫలములను రద్దు చేయగల శక్తి స్వామికి ఉన్నది కావున వాటిని రద్దు చేయమని అర్ధించును. అట్టివాడు స్వామి యందు నిజమైన భక్తి కలవాడు కాడు. అట్టివాడు స్వామిని అరాధించుచు మొండిపట్టును పట్టుచూ ఉండును. స్వామి ఎన్నడును కర్మ ఫలములను రద్దు చేయడని వానికి చెప్పినను వినక కర్మఫలములను రద్దు చేయగల శక్తిని ఉపయోగించమని స్వామిని కోరును. నా కర్మఫలములను అనుభవించి యైనను నాకష్టములను తొలగించమని మాట బయిటకు అనడు. అట్లు అన్నచో స్వామిపై తనకు భక్తిలేదని నిరూపించబడును కావున తనకు భక్తిలేదను మాట బహిరంగముగా తెలియరాదని భావించును. కాని లోలోపల " నీవు అనుభవిస్తావో లేక రద్దు చేస్తావో నాకు తెలియదు.నా కష్టమును తొలగించుము" అని ప్రార్ధించును. దాని కొరకై ఎక్కువగా ఆరాధనము చేయును. ఇది సత్యమైన భక్తి కానేకాదు. ఇట్టి భక్తుడు భగవంతుని తన సుఖమును సాధించుకొనుటకు పనిముట్టుగా వాడుకొనుటయే అగును. ఇట్టివాని భక్తి అనగా ప్రేమ అంతయును తన మీదనే ఉండును. ఇదియే స్వార్ధము. తన కష్టములను తొలగించనిచో ఆ రూపమును వదలి మరియొక రూపమును పట్టును.
ఇట్టి భక్తుని కష్టముల సైతము తొలగించి లోకములో దైవ విశ్వాసమును కాపాడుచున్నాడు. అయితే ఇట్టి భక్తుని కష్టములు తొలగించుటలో పద్ధతి వేరుగ యుండును. ఇట్టి కపట భక్తుని కర్మఫలములను స్వామి అనుభవించడు. వాని కర్మ ఫలములను తరువాత జన్మలకు స్వామి త్రోసివేయును. ఈ కపట భక్తుడు తన కష్టములను స్వామి రద్దు చేసినాడని భావించుచున్నాడే కాని తరువాత జన్మలలో వాటిని పెరిగిన వడ్డీతో అనుభవించవలయును. కావున కపట భక్తునకు స్వామియును కపటముగనే ప్రవర్తించినాడు. బయుటకు ఒకటి పలికి లోపల ఒకటి తలచి ఒక మానవుడు అల్పజ్ఞుడగు మరియొక మానవుని మోసగించవచ్చునేమో గాని సర్వజ్ఞుడగు పరమాత్మను ఎట్లు మోసగించగలడు?

సత్యమైన భక్తుడు జ్ఞాని కావున ఇట్లు ఆలోచించును. "నా కష్టములను రద్దు చేయమని పరమాత్మను నేను ప్రార్ధించినచో స్వామి నా కష్టములను అనుభవించవచ్చును. స్వామి భాధపడుట నేను ఏ విధముగను సహింపజాలను. కావున ఈ మార్గమును అంగీకరించజాలను. కాని రెండవ మార్గమున కర్మ ఫలములను తరువాత జన్మలకు త్రోసినచో అనవసరముగా పెరిగిన వడ్డీతో వాటిని ఏల అనుభవించవలెను? ఇప్పుడే తక్కువ వడ్డీతో అనుభవించెదను" అని నిజభక్తుడు ఎప్పుడును తన కష్టములను గురించి చింతించడు. ఇంకనూ, మహాజ్ఞాని యగు సద్భక్తుడు రాబోవు జన్మలలో ఏర్పాటు చేయబడి ఉన్న దుష్కర్మఫలములను ముందుకు లాగి ఈ జన్మలోనే తక్కువ వడ్డీతో అనుభవించి లాభమును పొందగోరి ఆ విధముగా కర్మ నిశ్శెషము చేయమని స్వామిని ప్రార్ధించును. ఇట్టి సద్భక్తుల కష్టములను కూడా స్వామి తొలగించను. కాని ఏ మార్గమున తొలగించును అన్నచో స్వామి వాటిని ఆకర్షించుకొని వాటిని తానే అనుభవించి వారిని కష్ట్టవిముక్తులను చేయును. ఇట్లు స్వామి తాను చేసితినని ఆ సద్భక్తునకు తెలియనీయడు తెలిసినచో ఆ సద్భక్తుడు అంగీకరించడు. స్వామికి కర్మ ఫలములను రద్దు చేయగల అధికారమున్నను దానిని దుర్వినియోగము చేయడు. అంతేకాదు ఆ కర్మ ఫలములను అనుభవించునప్పుడు స్వామి ధరించిన శరీరము మన శరీరము వంటిదే అగును. కావున మనకు ఎంత బాధకలుగునో అంతే బాధ స్వామికి కలుగును. బాధను అనుభవించునపుడు తన దివ్యశక్తని ఉపయోగించి ఓర్చుకొనగలడు. కాని అట్లు చేసినచో "నా భక్తుల కర్మఫలములను నేను అనుభవిస్తానని" స్వామి ధర్మ దేవునకు వాగ్దానమును మోసముతో భంగపరచినట్లగును. ఏ భక్తుడు ఏ రూపమున ఆరాధించినను అన్ని రూపములలో యున్న వ్యకి స్వామియే కావున సమస్త సృష్టిలో ఉన్న అందరి సద్భక్తుల కర్మ ఫలములను తానొ్క్కడే అనుభవించుచుండును. కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే గదా! ఈ కారణము చేతనే అవతార శరీరము కూడా మన శరీరము వలె అన్ని ప్రకృతి ధర్మములను కలిగియుండును. ఈ రహస్యమును తెలియక భక్తులు మూర్ఖముగా ప్రవర్తించుదురు. అవతార శరీరము మనకన్న విశిష్టమని భావించి ఒక మూఢ భక్తురాలు అవతార పురుషుని కాలి మీద టెంకాయ పగులకొట్టినది. స్వామి యొక్క పాదము వాచి పదిరోజులు బాధపడినారు. స్వామి మహిమలను చూచి స్వామికు ఆకలి దప్పికలు ఉండవని తలచి యశోద ఒకనాడు స్వామికి చద్దిఅన్నము మూట కట్టకుండా పంపినది. ఆ రోజు స్వామి గోవులను కాచి తిరిగి తిరిగి శ్రమతో అలసిపోయి ఆకలితో నీరశించి ఋషులు చేయు చున్న యజ్ఞవాటికను చేరి ఆ వండిన చెరువును పెట్టమని మునిపత్నులను అర్ధించినాడు. స్వామి దివ్య దర్శనములను సద్భక్తులకు అనుగ్రహించునపుడు కూడ ఒక మహాశక్తి ఈ సామాన్య శరీరము నందు ప్రవేశించుట చేత ఆయన శరీరము కూడ ఎంతో కష్టమును అనుభవించును.

కావుననే జ్ఞానులైన సద్భక్తులు స్వామిని దివ్యదర్శనముల కొరకు అర్ధించరు. స్వామిపై పరిపూర్ణ విశ్వాసము లేకపోవుటయే ఆ దివ్యదర్శన కుతూహలము అని తెలియవలయును. చూచి నమ్మిన వాని కన్నను చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈ విధముగా స్వామి అవతరించినపుడు ఆయన శరీరము ఎన్నో ముళ్ళతో గుచ్చబడి యుండును. ఆ ముళ్ళు మన కంటికి కనిపించవు. స్వామి సింహాసనముపై కూర్చునవలయునని స్వామితో కైవల్యము సాధించవలయునని జీవులు తహతహలాడుదురే తప్ప ఆయన కూర్చున్న సింహాసనము మీద ఉన్న ఎన్నో ముళ్ళు ఆయన శరీరములో దిగబడినవి మన కంటకి కనిపించవు. జీవుడు యదార్ధము తెలియక కైవల్యమునకై అర్ధించు చున్నాడే తప్ప నిజముగ స్వామి కైవల్యము ఒక్క క్షణకాలము పొంది ఆ సింహాసనముపై కూర్చున్నచో వాడు ఒక్క దూకుతో దాని నుండి బయిటకు వచ్చి పరుగుతీయును. అప్పుడు వాడు ఎప్పటికు స్వామి పదవి వద్దు భక్తునిగనే ఉండుదును అని మొరపెట్టును. ఆ ఒక్క క్షణకాలపు బాధకూడా ఎంతో తీవ్రాతి తీవ్రము కనుకనే స్వామి తన బిడ్డలైన జీవులు బాధపడుదురని కరుణతో జీవులు ఎంత అర్ధించినను కైవల్యము ఇచ్చుటలేదు. ఇది తెలియక జీవులు స్వామి కైవల్యమును ఇచ్చినా స్వామితో సమానత్వము పొందినచో స్వామి ఓర్వలేక అసూయతో కైవల్యము ఇచ్చుట లేదని అపార్ధము చేసుకొందురు. అయిననూ స్వామి వారు ఒక్క క్షణకాలమైనను ఈ బాధకు తట్టుకొనలేరని కైవల్యము ఇచ్చుటలేదు. మహాశక్తిమంతుడు మహాబలవంతుడు అగు హనుమంతుడే ఒక్క క్షణకాలము స్వామితో కైవల్యమును అనుభవించి ఆ బాధలను తట్టుకొనలేక కైవల్యము వదలి "దాసోహం" అన్నాడు. జగత్తు యొక్క సృష్టి, స్ధితి, లయ బాధ్యతలైనను నిర్వర్తించుటకు హనుమంతుడు ముందుకు వచ్చినాడే కాని కైవల్య పదవిని మాత్రము వద్దని సదా దాసోహం అన్నాడు. అందుకే రామకృష్ణ పరమహంస పంచదారను తిను చీమగా ఉంటాను గానీ పంచదారను మాత్రము కాను అని అన్నాడు. అందుకే మధ్వాచార్యులు స్వామికి జీవునకు మధ్య సేవ్య సేవక సంబంధమే ఉత్తమమని బోధించాడు.
At the lotus feet of Shri Dattaswami
-దుర్గాప్రసాదు

Monday, September 14, 2009

దత్త భగవానుడు ఏ రూపములో ఏ లోకములో ఉంటాడు?

గురువు శిష్యులకు బోధించినపుడుగాని లేక అపమార్గమున ఉన్న సాధకులను సరియగు మార్గమునకు తెచ్చుటగాని చేయునపుడు వారి యొక్క మానసిక తత్త్వమును అనుసరించి బోధలను చేయవలసి వచ్చును. సత్యమిది అని చెప్పినచో ఆ సత్యమును ఒక్కసారి జీర్ణించుకొనలేరు. ఒక పెద్దబండను చూపి దీనిని ఎత్తుకొనవలెను అని చెప్పినపుడు దానిని చూచి దానిని నేను ఎత్తలేనని శిష్యుడు వెనుదిరిగిపోవును. అదే బండను చిన్న చిన్న రాళ్ళుగా పగులకొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరాయిని ఎత్తమన్నచో శిష్యుడు ఆ పనిని సులభముగా చేయును. ఈ పరము నిష్ఠుర సత్యము ఏమనగా పరమాత్మ ఎప్పుడును పరోక్షముగా లేడు. ఆయనకు ప్రత్యేకముగా ఒక లోకము లేదు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము అనగానే వెంటనే జీవుల యొక్క మానసిక స్ధితి ఏమనగా ఒక దివ్యమైన విమానమును ఎక్కి పైకి పోగా పోగా పోగా భూమి నుండి రాకెట్‌లో చంద్రమండలము చేరినట్లు ఈ లోకమునకు పోవచ్చును అని తలచెదరు. అప్పుడు ఆ లోకములో దత్తుని త్రిమూర్తుల స్వరూపముతో చూడవచ్చును అని తలచెదరు. ఇది సత్యమును అర్ధము చేసుకొనని వారి యొక్క మానసిక స్ధితి. వారు ఈ భ్రమలలో ఎంత కూరుకొని పోయినారు అనగా ఎవరు చెప్పినను వినరు. విన్ననూ జీర్ణంచుకొనలేరు. కావున తిరస్కరింతురు. ఇట్లు వారికి వారి భ్రమలను సంతృప్తి పరచుచు సత్యమును ముక్కలు చేసి ఒక ముక్కను ముందు అందించి అది జీర్ణముగు వరకు కొంతకాలము ఆగి మరియొక ముక్కను మరల అందించుచు ఇట్లు క్రమముగా పూర్ణసత్యమును అందించబడు చున్నది. పూర్ణసత్యమును అందించు సమయము ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టవచ్చును. అనగా జీవుడు పూర్ణసత్యములోని ఇంత ముక్కను మాత్రమే జీర్ణించుకొనగలడు. కావున ఈ జన్మలో అంతకన్న ఎక్కువ బోధించరాదు. కరుణామయమైన వాత్సల్యముతో కూడిన గురుతత్త్వమిదే. ఇప్పుడు నేను ఇక పూర్ణసత్యమును చెప్పుచున్నాను. అనగా ముక్కలు చేయకయే ఒకేసారి పెద్దబండను చూపించుచున్నాను. మీలో ఎందరు జీర్ణించుకొనగలరు. ఇది చెప్పినచో మోరందరు నన్ను 'నాస్తికుడు' అని అందురు. సరె! చెప్పుచున్నాను వినుడు. "పరమాత్మ ఎప్పుడును భూలోకములోనే నర స్వరూపములలోనే యున్నాడు". ఆయన ఉన్న స్ధలమే బ్రహ్మ, విష్ణు, శివ లోకములు. దత్తుడనగానే మూడు ముఖముల ఆరుచేతులు గల స్వరూపమే మనకు స్పురించును. ఇట్టి నర స్వరూపములో దత్తుడు కనిపించినచో వెంటనే జనులు మూగి ఈ వింత స్వరూపమును చూచుటకు సర్కస్‌ వారు తీసుకొని పోయి టికెట్టు పెట్టి వ్యాపారము చేసుకొందురు. ఆయన ఎల్లప్పుడును ఒకే ముఖముతో రెండు చేతులతో సంచరించుచున్నాడు. ఆ వింత రూపము లేదు కాన ఆయననను ఎవరును దత్తుడని గుర్తించరు. ఆయన యొక్క మూడు ముఖముల అర్ధమేమి?

ఒక వ్యక్తిని చూపి ఇతడు బహుముఖ ప్రజ్ఞావంతుడని ప్రశంశింతురు. అనగా అనేక విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్ధము. అంతేకాని అనేక ముఖములు కలవాడు అని కాదు. త్రిముఖములు అనగా మూడు విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్ధము.1) సృష్టిని చేయుటలో 2) సృష్టిని పాలించుటలో 3) సృష్టిని సంహరించుటలో సామర్ధ్యము కలవాడు అని అర్ధము. ఒక ముఖమునకు రెండు చేతులు లెక్క ప్రకారము ఆరు చేతులను తగిలించినారు. వాడు వెయ్యి చేతులతో యుద్ధము చేయుచున్నాడు అన్నప్పుడు ఒకే సమయమున అనేకులతో యుద్ధము చేయు ప్రజ్ఞ కల వానిని ఆ విధముగా అందురు. ఆరు చేతులు అనగా ఆరు విధములుగ పనులు చేయువాడు అని అర్ధము. 1) శంఖహస్తము: అనగా వేదార్ధమును వివరించి వేదమును ప్రచారము చేయువాడు అని అర్ధము. 2) చక్రపాణి యనగా: కాలమును సృష్టిని తన అధీనములో ఉంచుకొన్న వాడని అర్ధము. 3) ఢమరుక హస్తము అనగా: సర్వ శాస్త్రములను సమన్వయించి జ్ఞాన ప్రచారము చేయువాడు అని అర్ధము. 4) త్రిశూలపాణి అనగా: భూత, భవిష్యత్‌, వర్తమాన ్కర్మఫలదాత యని అర్ధము. 5) మాల హస్తమునందు ఉన్నది అనగా: మనమునకు ఆకర్షించి పదే పదే భజనలను రచించి, పాడి భక్తి ప్రచారము చేయువాడని అర్ధము. 6) కమండలపాణి అనగా: జడమైన దేహము. దానిలోని జలము అనగా దేహములో నున్న జీవచైతన్యము. జీవనము అను శబ్ధమునకు నీరు, ప్రాణము అను రెండు అర్ధములు కలవు. ఈ విధముగా వేదశాస్త్రముల ద్వారా జ్ఞాన ప్రచారమును, గాయత్రి అను గానాత్మకమగు పద్ధతి ద్వారా భక్తి ప్రచారమును చేయుచు సృష్టిని, కాలమును, కర్మల యొక్క ఫలములను, జీవుల యొక్క ప్రాణములను తన గుప్పెటలో ఉంచుకున్నవాడని తాత్త్వికమైన అర్ధము. అనగా యదార్ధమైన అర్ధము.

ఇట్లు యదార్ధమును చెప్పినచో పౌరాణిక చిత్రములను,సినిమాలలో, టి.వి లలో చూచి చూచి పౌరాణికులు చెప్పు కధలు విని విని ఆవకాయ జాడీలో ఊరిన మామిడి ముక్కల వలె అణువు అణువు భ్రాంతిలిక్కి పోయిన జీవులు ఇట్టి పరమసత్యమైన అర్ధము చెప్పిన వానిని చూచి ఇంక కొంచము సేపు విన్నచో వీడు తానే దత్తుడనని చెప్పుకొను విధముగా ఉన్నాడు. కావున ఈ పిచ్చివానిని వదలి పోవుదమని వెడలి పోవుదురు. అందుకే దత్తుడు సాయి రూపమున శిరిడి వచ్చినప్పుడు కొంత కాలము వైద్యునివలె ప్రవర్తించెను. తరువాత కొంత కాలము మంచి మాటలు చెప్పు గురువువలె ప్రవర్తించెను. ఆ తర్వాత కొంత కాలము సిద్ధులు కలిగిన యోగిగా ప్రవర్తించెను. చిట్ట చివరి అంత్యకాలమున అందరును క్రమక్రమముగా జీర్ణించుకొన్న తర్వాత తాను పరమాత్మగా ప్రవర్తించెను. శిరిడిలోనికి ప్రవేశించగనే తాను దత్త పరమాత్మను అని చెప్పియున్నచో అందరును పిచ్చివాడని తరిమియుండెడివారు. పరమాత్మ ఎల్లప్పుడు భూలోకముననే మామూలు నరస్వరూపముననే ఉండి మనలోనే సంచరించుచూ ప్రత్యక్షముగా మనకు కనబడుచుండునని వేదము ఘోషించు చున్నది. "యత్‌ సాక్షాత్‌ అపరోక్షాత్‌ బ్రహ్మ" అని శ్రుతి. అనగా పరబ్రహ్మము ఎప్పుడును పరోక్షముగా లేడు. మనకు ఎల్లప్పుడు ప్రత్యక్షమగుచు నర స్వరూపములోనే ఉన్నది అని అర్ధము. వేద ప్రమాణమునకు ముందు స్మృతులు అనగా పురాణములు నిలువలేవు. "శ్రుతి స్మృతి విరోధేషు శ్రుతి ఏవ గరీయసి" అనగా వేదములకు, పురాణములకకు విరోధము వచ్చినచో వేదమే ప్రమాణము అని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇక వేదము ముందు సినిమాలు, టి.వి లుఎంత.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, September 1, 2009

Shall we aim for the post of Shankara or the post of Disciples of Shankara?

The path of Top Most Devotees

The top most devotees who also turned out top most jnanis (knowledged) by achieving the top most laurels by pleasing the Lord are ....

Hanuman, a topmost devotee identified Lord Rama and served Him and always said ‘I am servant to Lord Rama’. He even performed many miracles also and still he has given credit of them to Rama only (Dasoham kosalendrasya...). For such worship, Lord has given future creator post to Hanuman.

Gopikas identified and worshiped Lord Krishna, the then human incarnation only and got the highest fruit of top most Goloka.

Swami Vivekananda participated in the mission of propagation of divine knowledge on the order of the then human incarnation Rama Krishna Paramahamsa.

Likewise the disciples of Adi Sankara worshipped Him as lord and latter on participated in the propagation of divine knowledge.

Meerabai also propagated Krishna Bhakti by composing hymns and propagated them.

In all these the disciples identified the Lord in the human form during their time and participated in His mission as servants. So, first one should identify the Satguru and then learn divine knowledge from Him. These disciples worshipped their Satguru. At His order, they participated in the propagation of divine knowledge as Service to Lord. Service only proves our real devotion, which consists of Karma phala tyaga (sacrifice of money) & karma sanyasa (physically participating in His mission).

In all these cases, the devotees did not consider themselves as God. Sankara, who propagated advaita (Non-dualism) drank molten lead and told His disciples that 'you are all not Lord. I am only Lord' (Shivah kevaloham). The disciples could not drink it. So, only Sankara is Lord in human form and not disciples. If disciples themselves are not Lord, normal human beings cannot even think of in their dreams also.

Have we achieved Dvaita first?

People often misunderstand that Dvaita is relationship between God & an ordinary human being. Such relationship is only the creator-created relationship. In Dvaita, Madhva says that the relationship between God and the soul is the relationship of Master-servant. Madhva Himself kept in the position of the servant of God. Every human being cannot claim such position of Madhva, without reaching that state by spiritual effort (Correct Spiritual Knowledge – Theoretical Devotion – Service).

You must know that practical service to God alone can give any divine fruit. Correct spiritual knowledge & theoretical devotion are only like water & fertilizer for service-plant, which alone can yield fruit. Through such selfless sacrifice of service in terms of sacrifice of work & fruit of work, you will be selected as servant by God provided your service does not aspire any fruit including fruit of becoming human incarnation. Now you have entered inner circle of God & this is 1st step called as Dvaita.

If you see Hanuman, He straightly jumped from the knowledge to the service and never expressed His love on God through songs and tears as per Valmiki Ramayana. Some plants yield fruits just with supply of water without fertilizer. Therefore, sometimes knowledge and service are sufficient without the intermediate theoretical devotion. But here the soil acts as a hidden fertilizer. Similarly, the theoretical devotion of Hanuman was kept hidden in the mind only. Hence this intermediate state exists in a hidden way in such cases.

Now one of the closest servants excels other servants in service and becomes the Son of God and sits on the right side of God as told by Jesus. Ramanuja also says that one of the most fortunate devotees sits on the lap of Lord Narayana and talks with Him and this is exactly coinciding with the above point of Bible. This is the second state of Vishishtaadvaita. Now such Son of God comes down to the earth with a gross body (as usual like any other human being) and God enters him and pervades all over the soul and body.

Now, this Son of God is the human incarnation and is treated as God by the devotees for hearing the knowledge and serving the God. This Son of God gets the credit of all the wonderful works done by God, who is hidden in him. This is the third & final state of Advaita. God entered the devotee, stays for his lifetime and exits at the end. The entry of God is mentioned in the Veda (Tadevanupravishat…). The exit of God is mentioned in the Bible, when Jesus cried stating ‘Oh! God! Why did You leave me?

Shankara, Shri Ramakrishna Paramahansa, Ramana Maharashi are all the human incarnations. See the closest devotees of these incarnations like Mandanamisra, Padmapada, Swami vivekananda etc who were ready to do anything on the order of the Sadguru.

Now we have to think whether we should aim for the post of Shankara (GOD) or aim for the post of Disciples of Shankara?

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Reply to comment made by Shri Tadepalli

తాడేపల్లి గారు,
మీరు post మొత్తం చదివినట్లు లేదు. శ్రీ ఆది శంకరుల వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. వారు నాస్తికులైన బౌద్ధులను ఆస్తికులుగా మార్చటానికి అద్వైత వాదమును జీవులందరికిని extend చేసినారు. ఇది వారిని ఉద్ధరించటానికి చేసిన అర్ధ వాదము. తరువాత కరిగిన సీసము త్రాగుట ద్వారా తాను మాత్రమే భగవంతునని నిరూపించినారు. భగవంతుడు చెప్పే జ్ఞానము జీవులను ఉద్ధరించటకు మాత్రమే కాని, గెలుపు ఓటముల ప్రసక్తే లేదు.

A mother feeds her child singing that the moon will come down from the sky if the child eats the food. She is worried about the welfare of her child and does not bother about the truth. The mother misinterprets to the child that if it eats the food, the moon will come down. This is not deceiving the child and there is no sin in this because the child is helped and not harmed at all. Such twists for good results exist in the tradition, which are created by the learned sages. These are called as Artha Vadas, which mean lies told for good purpose.

The love and compassion of a Guru on his student is million times more than that of the mother. ‘Sadguru’ is the God of the mother who came down as the teacher and the love of the Sadguru (like Shankara) is beyond description. First, Shankaracharya came, who was the incarnation of Lord Shiva in human form. India was full of atheists who were either Buddhists or Purva mimamsakas. An atheist can never tolerate the greatness of God and so denies His existence. Shankara said, “I am Shiva” (Shivoham…). Can an atheist tolerate this and accept that another man as God? But, the Sadguru should also uplift the atheist. Shankara made a trick. He told that every man is God. An atheist likes his own greatness and so becomes the follower of Shankara. Atleast some atheists changed. Shankara equally distributed God, which is like a treasure to all. There is a secret in this trick.

Some disciples became fully pure and got rid of jealousy and egoism in course of time through constantly serving Shankara and they were eligible to grasp the truth. Shankara revealed the truth to such deserving disciples. Shankara swallowed molten lead and asked them to swallow the same if they were God. The disciples were unable to swallow the same and fell at the feet of Shankara since they grasped the truth. But, Shankara limited this revelation of the truth to some of His close deserving disciples only, since others were not able to grasp the truth due to their egoism. Shankara left the earth at this stage.
శంకరులు వారు సాక్షాత్తు దత్తావతారము. దత్తుడు అనగా మనుషులకు మనిషి రూపములో దత్తత ఇవ్వబడిన భగవంతుడు. భగవంతునకు అద్వైతవాదము Apply చేయవచ్చు. జీవునకు కాదు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

>>>>>>>>>>>>>>>>>>>>>
Comment made by Shri Tadepalli:
ఈ వ్యాసపరంపర నాకు నచ్చలేదు. బహుశా ఎవరికీ నచ్చదు. శివావతారమైన శ్రీ ఆదిశంకరుల్ని మీరు పరోక్షంగా దూషిస్తున్నట్లు గోచరిస్తున్నది. భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైతం పట్ల ఆయనకే నిబద్ధత లేదనీ, అది కేవలం బౌద్ధుల్ని వాదంలో ఓడించడానికి ఉద్దేశించినదేననీ, కనుక అది అసత్యమని మీరు ధ్వనిస్తున్నారు. శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రతిపాదించడానికి 2,500 సంవత్సరాల పూర్వమే భగవాన్ శ్రీ బాదరాయణ మహర్షులవారు తమ బ్రహ్మసూత్రాల్లో దాన్ని ప్రతిపాదించి ఉన్నారని మీకు తెలియకపోవచ్చు.

ఏదేమైనా ఈ రకమైన ధోరణి పాపహేతువు. పైగా ఈ వాదం హిందూమతానికి మేలు చెయ్యదు. త్రిమూర్తిస్వరూపులైన దత్తాత్రేయస్వములవారు స్వయంగా అద్వైతి.

-- తాడేపల్లి