'అన్నార్తులకు అన్నము, జ్ఞానార్తులకు జ్ఞానము, భక్తిని పంచినచో ఆ సేవ నిజముగా మీ లెక్కలోనికి చేర్చబడును' అంటారు స్వామి. భక్తులు స్వామిని దత్తావతారముగా గుర్తించి విశ్వసిస్తున్నారు. స్వామి ప్రసాదించిన అనేక దివ్య ఉపన్యాసాలను ఈ బ్లాగు ద్వారా పొందగలరు. ఈ దత్తసేవలో పాల్గొని ఇతర భక్తులు కూడా శ్రీ దత్త ప్రభువుల యొక్క అనుగ్రహమును, ఆశీస్సులను పొందుదురుగాక! స్వామి గారి భజనల కొరకు BHAKTIGANGA లింక్ చూడండి.
Thursday, August 6, 2009
దత్త జయంతి అంతరార్ధము: ఉపవాసము అనగా
ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవుట. అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. కొందరు అన్నమునకు బదులుగా అప్పచ్చులను తిని ఉపవాసమనుచున్నారు. ఇదే నిజమైనచో కేవలము గోధుమ రోట్టెలనే తిను ఉత్తర దేశీయులు నిత్యోపవాసులగుదురు. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది. అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నముగావదలి వేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమగుట అంత ఉన్నత స్ధాయికి పోలేక మధ్యలో అకలి అగుచో క్షీర ఫలాదులను స్వీకరింతురు. "పయో బ్రహ్మణస్య వ్రతమ్" అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో అట్టి రోజే "దత్త జయంతి".
Subscribe to:
Post Comments (Atom)
chala bagundi.
ReplyDeleteOm Namo Bhagavate Sri Ramanaya
Prashant Jalasutram