Monday, August 31, 2009

శంకరులు (Part-2)

నిజమే! శిష్యులు బౌద్ధులైనప్పుడు గురువు ప్రచ్ఛన్న బౌద్ధుడే కావలయును. బురదలోని వారలను పైకి లాగుటకు గురువు బురదలో దిగవలయును. ఇది గురువుకు తప్పదు. ఆ గురువుకు బురద అంటుకొనక తప్పదు. ఇట్లు నాస్తికులగు బౌద్ధులను ఆస్తికత్వమను మెట్టు ఎక్కించి శంకరలు నిష్క్రమించిరి. శిష్యులు అపార్ధము చేసుకొని నేనే భగవంతుడనని భ్ర్రమించి వాగుచూ అహంకారము పరాకాష్ఠకు చేరి పతితులైనారు. శంకరులు నిష్క్రమించక ముందే జీవుడు భగవంతుడు కాదని కరిగిన సీసమును తాగి శిష్యులు అది తాగలేకపోగా యదార్ధము బోధించినారు. అద్వైత పండితులు ఈ ఘట్టమును గురించి ఎప్పుడునూ మాట్లాడరు. శంకరుల భాష్యమంతయును వివరరింతురే కాని శంకరులు ఒక్కరే సీసమును త్రాగినారని కావున శంకరులు అను జీవుడొక్కడే బ్రహ్మమ అనియు, ఇతరులు బ్రహ్మము కాదనియు ఎప్పుడును పలుకరు. ఈ ఘట్టము వారి అహంకార, మాత్సర్య, మొండితనమునకు అనుకూలము కాదు. తమ కన్న అధికుడైన భగవంతుడు ఒకడున్నాడని చెప్పినంత మాత్రముననే ఓర్వలేని నాస్తికులు, ఆ భగవంతుడు నరరూపమున అవతరించును అని చెప్పిన నమ్ముదురా! కావున శంకరులు నేను బ్రహ్మము, నీవు బ్రహ్మము. ఇరువురము సమానమే అని చెప్పి నాస్తికులను మెల్లమెల్లగా సన్మార్గము వైపునకు లాగెను. ఈ సిద్ధాంతమునకు వారి అహంకాము, మాత్సర్యము సంతృప్తి చెందినది. కావున, ఈ సిద్ధాంతము చాలా బాగున్నదని వారు శంకరులకు శిష్యులైనారు. కొంతకాలము గడచిన తర్వాత కరిగిన సీసము తాను త్రాగి మీరు నేను బ్రహ్మమే కదా కావున మీరును త్రాగుడు అనెను.

ఇట్లు కొంతకాలము గడచిన తర్వాత మెల్లగా జీవుడు కన్నా పరమాత్మ అధికుడనియు, ఆ పరమాత్మ నరరూపమున కూడా అవతరించుననియు బోధించెను. ఇదే శంకరుల వారి చిట్ట చివరి బోధ. ఈ బోధతో కొందరు శిష్యులు మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు ఆయన నరరూపములో కూడా వచ్చును అని విశ్వసించి తరించరి. కాని మరికొందరు మాత్రము మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు కాని ఆయన నరరూపమున ఉండడు అని తలచినారు. అనగా వీరిలో అహంకార మాత్సర్యములు కొంత శాంతించినవి. అనగా అధికుడైన భగవంతుడు ఉన్నాడు అంతవరకు అవి శాంతించినవి. కాని సాక్షాత్తుగా తమవంటి నరరూపమున ఉండుననుట వారు ఓర్చలేకపోయినారు. కావున వీరికి అకూలముగా బోధచేయుటకు దత్తుడు రామానుజ రూపమున అవతరించినారు. అధికుడైన భగవంతుడు వైకుంఠమున నారాయణ స్వరూపముగా ఉన్నాడు. ఆయనను జడ స్వరూపములైన పటములు, విగ్రహముల రూపమున అర్చించు విధానమును ఏర్పరచినాడు. తమమవంటి నరుని భగవంతునిగా అర్చించుటలో అసూయ పుట్టునుగాని, జడములైన పటములు విగ్రహరూపములలో అర్చించుట అంత అసూయ జనించదు. తమ వంటి నర స్వరూపమున ఉన్న భగవంతుడు ఈ లోకమున లేడ ఎక్కడో వైకుంఠమున ఉండును. మన కంటపడడు. కావున మనము ఎట్టి నరుని అర్చించ పనిలేదు అను మతమును రామానుజుడు ప్రవేశపెట్టినాడు. ఎప్పుడు అసూయ పూర్తిగా నశించునో అప్పుడు అట్టి జీవుడు అనసూయ యగును. అట్టి జీవునకు నరస్వరూపమున ఉన్న పరమాత్మ దత్తుడగును. అనగా చిక్కును.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

3 comments:

  1. ఈ వ్యాసపరంపర నాకు నచ్చలేదు. బహుశా ఎవరికీ నచ్చదు. శివావతారమైన శ్రీ ఆదిశంకరుల్ని మీరు పరోక్షంగా దూషిస్తున్నట్లు గోచరిస్తున్నది. భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైతం పట్ల ఆయనకే నిబద్ధత లేదనీ, అది కేవలం బౌద్ధుల్ని వాదంలో ఓడించడానికి ఉద్దేశించినదేననీ, కనుక అది అసత్యమని మీరు ధ్వనిస్తున్నారు. శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రతిపాదించడానికి 2,500 సంవత్సరాల పూర్వమే భగవాన్ శ్రీ బాదరాయణ మహర్షులవారు తమ బ్రహ్మసూత్రాల్లో దాన్ని ప్రతిపాదించి ఉన్నారని మీకు తెలియకపోవచ్చు.

    ఏదేమైనా ఈ రకమైన ధోరణి పాపహేతువు. పైగా ఈ వాదం హిందూమతానికి మేలు చెయ్యదు. త్రిమూర్తిస్వరూపులైన దత్తాత్రేయస్వములవారు స్వయంగా అద్వైతి.

    -- తాడేపల్లి

    ReplyDelete
  2. తాడేపల్లి గారు,
    మీరు post మొత్తం చదివినట్లు లేదు. శ్రీ ఆది శంకరుల వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. వారు నాస్తికులైన బౌద్ధులను ఆస్తికులుగా మార్చటానికి అద్వైత వాదమును జీవులందరికిని extend చేసినారు. ఇది వారిని ఉద్ధరించటానికి చేసిన అర్ధ వాదము. తరువాత కరిగిన సీసము త్రాగుట ద్వారా తాను మాత్రమే భగవంతునని నిరూపించినారు. భగవంతుడు చెప్పే జ్ఞానము జీవులను ఉద్ధరించటకు మాత్రమే కాని, గెలుపు ఓటముల ప్రసక్తే లేదు.

    A mother feeds her child singing that the moon will come down from the sky if the child eats the food. She is worried about the welfare of her child and does not bother about the truth. The mother misinterprets to the child that if it eats the food, the moon will come down. This is not deceiving the child and there is no sin in this because the child is helped and not harmed at all. Such twists for good results exist in the tradition, which are created by the learned sages. These are called as Artha Vadas, which mean lies told for good purpose.

    The love and compassion of a Guru on his student is million times more than that of the mother. ‘Sadguru’ is the God of the mother who came down as the teacher and the love of the Sadguru (like Shankara) is beyond description. First, Shankaracharya came, who was the incarnation of Lord Shiva in human form. India was full of atheists who were either Buddhists or Purva mimamsakas. An atheist can never tolerate the greatness of God and so denies His existence. Shankara said, “I am Shiva” (Shivoham…). Can an atheist tolerate this and accept that another man as God? But, the Sadguru should also uplift the atheist. Shankara made a trick. He told that every man is God. An atheist likes his own greatness and so becomes the follower of Shankara. Atleast some atheists changed. Shankara equally distributed God, which is like a treasure to all. There is a secret in this trick.

    Some disciples became fully pure and got rid of jealousy and egoism in course of time through constantly serving Shankara and they were eligible to grasp the truth. Shankara revealed the truth to such deserving disciples. Shankara swallowed molten lead and asked them to swallow the same if they were God. The disciples were unable to swallow the same and fell at the feet of Shankara since they grasped the truth. But, Shankara limited this revelation of the truth to some of His close deserving disciples only, since others were not able to grasp the truth due to their egoism. Shankara left the earth at this stage.
    శంకరులు వారు సాక్షాత్తు దత్తావతారము. దత్తుడు అనగా మనుషులకు మనిషి రూపములో దత్తత ఇవ్వబడిన భగవంతుడు. భగవంతునకు అద్వైతవాదము Apply చేయవచ్చు. జీవునకు కాదు.

    At the lotus feet of Shri Dattaswami
    -Durgaprasad

    ReplyDelete
  3. అయ్యా ! శంకర భగవత్పాదుల పట్ల మీకు భక్తివిశ్వాసాలున్నాయని తెలిసి సంతోషం కలిగింది. కానీ ఒక విషయం. మీకు అద్వైతసిద్ధాంతం తెలియదు. సాధన కూడా తెలియదు. అందుచేత మీరు ఆ వాదానికి ఒక social relvance ని, ఒక చారిత్రిక వ్యాఖ్యానాన్ని సృష్టిస్తున్నారు. అద్వైత సాధన మీరు చేసి ఉండలేదనేది ఈ పలుకుల ద్వారా స్పష్టం. మీ మార్గం బహుశా వేఱు కావచ్చు. కాదనడంలేదు. వేఱైతే తప్పేమీ లేదు. కానీ అద్వైతానుభూతి కొఱకు ప్రయత్నించకుండానే అది అర్ధవాదమని త్రోసిపుచ్చడం సబబు కాదు. అద్వైతమార్గంలో ముందుకెళ్ళిన మహానుభావులు - శ్రీరామకృష్ణపరమహంస, శ్రీ వివేకానంద, శ్రీ రమణమహర్షి , వీరబ్రహ్మేంద్రులు, వేమన, వెంకయ్యస్వాములవారు మొ||నవారు చాలామంది ఉన్నారు. వారంతా జాబిలి భూమికి దిగొస్తాడని నమ్మిన అమాయక పసిబిడ్డలేనా ? అప్పటికి ఇంకా సాధకులుగానే ఉన్న శ్రీ శంకరభగవత్పాదుల శిష్యుల్ని అద్వైత సిద్ధాంతం యొక్క వైఫల్యానికి ఉదాహరణగా చూపడం సమంజసమేనా ? ఆలోచించండి.

    --తాడేపల్లి

    ReplyDelete