Friday, October 23, 2009

నాస్తికుడు

నాస్తికుడగు జీవుడు భగవంతుని అంగీకరించపోవుటకు కారణము వానిలో మేరు, వింధ్య శైలముల వలెనున్న అసూయ అహంకారములే. భగవంతుడనగా తన కన్న ఎన్నో రెట్లు గొప్పవాడని అర్ధము. భగము కలవాడు భగవంతుడు. భగము అనగా మతాత్మము అనగా గొప్పతనము. బ్రహ్మము అను శబ్ధమునకు కూడ గొప్పతనము కలది అనియే అర్ధము. తనకన్న లేక తన జాతియగు మానవజాతి కన్న గొప్పవానిని నాస్తికుడు అంగీకరించడు. భారతదేశమంతయును ఇట్టి నాస్తికులతోను పూర్వ మీమాంసకులతోను నిండియుండెను. వీరే కాక విష్ణువు యొక్క అవతారమగు కపిలమహర్షిని కూడా అపార్ధము చేసుకున్న శిష్యులు కూడా నాస్తికులుగనే యుండిరి. కపిలుడు ప్రకృతి పురుషుని గూర్చి చర్చించెను. పురుషుడు ప్రకృతి చేత లిప్తుడు కాడు అను అసంగ వాదనను కపిలుడు బోధించినాడు. "అసంగో హయః పురుషః" అన్నాడు కపిలుడు. కపిలుడు చెప్పిన పురుషుడు జీవుడని భ్రమించి జీవుడు ప్రకృతి చేత లిప్తుడు కాడని శిష్యులు అపార్ధము చేసుకున్నారు. కాని కపిలుడు చెప్పిన పురుషుడు అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు అగు స్వామి తన యొక్క శరీరమగు ప్రకృతి యొక్క క్షుత్పిపాసాది ధర్మముల చేత లిప్తుడుకాడనియే దీని అర్ధము. అనగా తీగెలో విద్యుత్త్తు ప్రవహించునపుడు సన్నగా యుండుట వంకరలు కలిగియుండుట మొదలగునవి తీగె ధర్మములు విద్యుత్‌ యొక్క ధర్మము కానందున విద్యుత్‌ను అంటవని అర్ధము. విద్యుత్తు లేని తీగె యొక్క ఈ ధర్మములు తీగె ధర్మములు కావున తీగెను అంటియే యుండును. అనగా క్షుత్పిపాసాది ధర్మములు జీవుని ధర్మములు కావున జీవుని అంటియే యుండును. ఈ జ్ఞానమును తెలుసుకొనుటయే సాంఖ్యము అనబడును. సాంఖ్యము అనగా జ్ఞానము అని అర్ధము కావున విష్ణువు యొక్క అవతారముగు కపిలుడు నాస్తికుడు ఎట్లు అగును? అట్లే కొందరు మూఢులు శివుని అవతారమగు శంకరులను ప్రచ్ఛన్న బౌద్ధుడని దూషించినారు. నాస్తికుని ఉద్ధరింప వలయున్నచో అతడు 5 మెట్లు ఎక్కవలయును.

1వ మెట్టు: పరమాత్మ ఉన్నాడు. కాని అతడు నిరాకారుడు. ఈ మెట్టులో పరమాత్మ సాకారుడని అంగీకరించుటకు అసూయ అహంకారములు కొంత తగ్గినను అడ్డువచ్చును.

2వ మెట్టు: పరమాత్మ సాకారుడు. కాని భూలోకములో కాక పైలోకములలో ఉండును. మొదటి మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గును.

3వ మెట్టు: పరమాత్మ నరాకారుడు కాని వర్తమానమున లేడు. అనగా గతించిన రామకృష్ణాది అవతారములు. రెండవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.

4వ మెట్టు: పరమాత్మ నరాకారుడే. వర్తమానమున ఉన్నాడు. అయితే స్వార్ధమగు ఐహికములకు గానీ, మోక్షమునకు గానీ అతడిని ఆశ్రయించుచున్నాము.మూడవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.

5వ మెట్టు: వర్తమానుడగు నరాకారుడు అగు పరమాత్మను పూర్తిగా స్వార్ధమును త్యజించి, సేవించుటయే బ్రహ్మప్రాప్తి. ఈ దశలో అసూయ అహంకారములు పూర్తిగా నశించినవి.

పరుగెత్తుచున్న మదవృషభమును నిలద్రొక్కుటకు దానితో పాటు కొన్ని అడుగులు వేయవలెను. ఒక్కొక్క అడుగునకు దాని వేగము తగ్గుచు ఉండును. కొన్ని అడుగుల తర్వాత ఒక అడుగులో వేగము పూర్తిగా తగ్గి అది నిలబడును. అదే విధముగా శ్రీ దత్త సద్గురువు శంకర రామానుజ మధ్వ రూపముల నాస్తికులను మద వృషభమును అనుసరించి అడుగులు వేయుచూ క్రమముగా నాస్తికులను మార్చుచూ చివరకు మధ్వాచార్య రూపమున 5 వ మెట్టు నకు ఎక్కించినాడు.

మొదట శంకరులు నాస్ధికుని జీవులందరునూ బ్రహ్మమే కావున నీవు జ్ఞానము చేత బ్రహ్మము అగుదువు. నీవే దేవుడవు. నీవు ఉన్నావు కాన దేముడున్నాడు. నీవు నిరాకారమైన చైతన్యము కావున, నిరాకారమైన దేముడున్నాడు. అని మొదటి మెట్టును ఎక్కించెను. ఆ తర్వాత శివస్తోత్రములగు శివానందలహరి మొదలగు వాటి ద్వారా సాకారుడైన దేముడు పైలోకములో ఉన్నాడు అని రెండవ మెట్టునెక్కించెను. ఆ తరువాత భజగోవింద స్తోత్రముల ద్వారా గతించిపోయిన నరాకారుడగు కృష్ణుడగు పరమాత్మ ఉన్నాడని మూడవ మెట్టు ఎక్కించెను. క్రమముగా శంకరులను, శిష్యులు ఆశ్రయించినారు.వారికి నేను నేనే శంకరుడను శివోహం, శివోహం అని స్తోత్రము ద్వారా బీధించి వర్తమాన నరావతారుడగు పరమాత్మ తానేనని వచించినారు. ఇది నాలుగవ మెట్టు. అయితే ఈ నాలుగవ మెట్టులో ఐహికములు, మోక్షమును ఆశించి శిష్యులు ఆశ్రయించిరి. తోటకుడు తన మూగి తనమును పోగొట్టమని ఐహికమును ఆశించి శిష్యుడైనాడు. ఆట్లే సురేశ్వరుడు మోక్షమును ఇమ్మని కోరుచు శిష్యుడైనాడు. ఈ నాలుగ మెట్టులో జీవుడు బ్రహ్మము కావచ్చునన్న ఆశ ఇంకనూ మిగిలియేయున్నది. అనగా స్వార్ధము కొరకే నాలుగవ మెట్టు ఎక్కినారు. ఈ సమయములో శంకరులు శివుడు హాలాహలము త్రాగినట్లు కరిగిన సీసమును త్రాగి జీవుడు ఈశ్వరుడు కాడని నిరూపించినాడు. మరియు జీవుడగు తాను మాత్రమే ఈశ్వరుడనని తేల్చినాడు. దీనితో శిష్యులు నిరాశచెందినారు. తను నిరాశను పోగొట్టుకొనుటకు జీవుడే బ్రహ్మమన్న వాదనకు దిగినాడు. ఇచ్చట శంకర రూపము నిష్క్రమించినది. రామానుజ రూపము వచ్చినది. నిరాశ చెందిన వారికి మరల కొంత ఉత్సాహమును కల్పించినారు. నీవు ఈశ్వరుడవు కాలేవు కాని పరమాత్మ శరీరములో ఒక భాగమై యున్నావు. భక్తిచేత ఆయన యొక్క శరీర అవయము వలె ఆత్మీయుడవు కావచ్చును అని బోధించినాడు. తాను కూడా పరమాత్మ యొక్క శరీర అవయవమే అన్నాడు. తాను శేషావతారమన్నాడు. శేషుడనగా శరీర అవయవము అని అన్నాడు. శేషుడు శయ్యగా శరీరముతో నిత్య సంబంధము కలదు. ఈ శేషశేషి సంబంధమే విశిష్టాద్వైతము. ఈ విధముగా శంకరులు జ్ఞానమును, రామానుజులు భక్తిని పరిపూర్ణము చేసినారు. ఇచ్చట రామానుజులు నిష్క్రమించినారు. ఇప్పుడు మధ్వరూపము వచ్చిది. మధ్వులు జీవుడు స్వామి కన్న వేరుగా ఉన్న ఒక నిత్య సేవకుడనియు, తాను ఆంజనేయుని అవతారమనియు బోధించినారు. ఇదియే ఐదవ మెట్టు.

శంకరులు నేను బ్రహ్మము, నీవు బ్రహ్మము కావచ్చునన్నారు. రామానుజులు నేను శరిరావయమును. నీవును స్వామి శరీరములోని అవయవమే భక్తిచేత స్వామికి ప్రియమైన అవయవము కావచ్చును అన్నారు. మధ్వులు నేను స్వామి సేవకుడను సేవ ద్వారా నీవును స్వామి సేవకుడవు కావచ్చున్నారు. జీవులు: ఎట్లు గురువులు ఏ స్ధితిలో ఉన్నారో ఆ స్ధితిని మీరు కూడా పొందవచ్చును అని ఆశ కూడా చూపించుట చేతనే స్వార్ధము వల్లనే జీవులు ఆకర్షితులు అయినారు. కాని చిట్ట చివరిలో మధ్వులు హనుమంతుడు ఎట్లు తాను ఉన్న కాలములో వున్న నరాకారుడగు స్వామిని ఐహిక, మోక్షకామములు లేక నిస్వార్ధముగా సేవించవలెనని అదియే మోక్ష కైవల్యములని ఐదవ మెట్టుకు చేర్చి నిష్క్రమించినాడు. ఇట్లు నాస్తికుని, హనుమంతుని స్ధితికి తీసుకు వచ్చినాడు. శ్రీ దత్త సద్గురువు శంకరులు జీవుడే బ్రహ్మ మని చెప్పిన వాదమును జాగ్రత్తగా పరిశీలించినచో సత్యము బోధపడును. జీవుడు బ్రహ్మము అన్నారు. నిజమే, కాని బ్రహ్మమనగా ఏమని చెప్పినారి?బ్రహ్మమనగా చైతన్యమని అర్ధము చెప్పినారు. ప్రత్యక్షమైన ఈ విషయములో చైతన్యము కన్నా గొప్ప పదార్ధము లేదు. ఈ చైతన్యము రాజులోను బిచ్చగానిలోను సమానముగా ఉన్నది. కావున రాజులోని జీవుడు బిచ్చగానిలోని జీవుడు చైతన్యమే. అనగా బ్రహ్మమే. నిర్మల గంగానదిలోను, బురద గుంటలోను సూర్యుని ప్రతిబింబము కనపడుచున్నది. ఆ రెండింటిలోను ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము ఒక్కటే. ఈ సూర్య ప్రతిబింబము బ్రహ్మము కానీ, గంగనీరు, బురదనీరు ఒకటియగునా? గంగనీరే ఈశ్వరుడు.బురదనీరే మానవుడు. ఈశ్వరుడిలోను, మానవునిలోను జీవుడు లేక ఆత్మయను ఒకే చైతన్యము గలదు. ఉదాహరణమునకు కృష్ణునిలోను, యాదవునిలోని ఒకే చైతన్యాత్మ వున్నది. కాని కృష్ణుడు గోవర్ధనమును ఎతినాడు. యాదవుడు ఒక బండను కూడా ఎత్తలేదు. ఇది ఉపాధికి సంబంధించిన జీవేశ్వరుల బేధమము. ఈ జీవేశ్వర బేధమును శంకరులు," "అనుప పత్తృహెః" అను బ్రహ్మ సూత్రములలో స్ధాపించినారు. "సత్యపి బేధాపరమే" అను శ్లోకమున ఓ ఈశ్వరా! నీకును జీవుడగునాకును అద్వైతము వున్ననూ నీలోనే నున్నాను. నీవు నీలో మాత్రమే లేవు. నాకు బయిటనూ ఉన్నావు. సముద్రములో తరంగము ఉన్నది, కాని సముద్రము ఒక్క తరంగమందే లేదు అని వచించినారు. జీవుడు బ్రహ్మమన్నారే కాని ఈశ్వరుడన లేదు. జీవేశ్వర బేధమును కరిగిన సీసము త్రాగుట ద్వారా, శంకరులు ఆచరణలోనే నిరూపించినారు.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

3 comments:

  1. 1)bharata desamanta nastikulato nindi unda?
    mari meeru?

    2) ahamkaarama?
    devudunnadani choopinchi, aa maata anandi. photo venuka velugu photo pettukuni deva doota laga kathalu cheppoddu.

    3) midi midi gnanam tho durbhashaladatam/picchi prelapanalu cheyyatam manchidi kadu,


    4) satya sodhan chesi upadesaalivvandi, pustakaallo rasindi, evaro cheppindi vini guddi ga nammatam ante anni oohinchukovatame.

    5) dayachesi mee paddhati marchukondi, meeru devudini nammite nammandi, nammani varini ahankarulu etc anoddu, proofs unnayya cheppandi, nenu ready devudini nammataniki,
    mondi vadanaloddu, direct to the point

    ReplyDelete
  2. The logic of atheists is based on perception (Pratyaksha Pramana), which was propagated by the sage Charvaka. Perception means the knowledge derived from the observation with the naked eyes. In fact in the logic (Tarka Sastra) all the means of knowledge are based on perception only. In the inference (Anumana) also, the fire on the hill is inferred by its smoke. But the relationship between the fire and smoke is perceived with the naked eyes only. Similarly other means of knowledge are also based on the perception only. Thus Charvaka forms the basic of the entire logic and without logic there is no knowledge. The statement that the God is above logic must be proved only by perception. The divine miracles performed by the human form of Lord proves that there is a power above the logic. These miracles are seen by the naked eyes. The atheists must be allowed to prove whether the miracles are simply magic tricks. When they cannot prove, they must accept the existence of super power above the logic. If they do not accept this they are contradicting their own basis, which is the perception. The divine miracles are experienced by the devotees and the experience cannot be contradicted. If the experience is contradicted, the experience of the atheists is also contradicted. Therefore atheists must be open-minded and should not be conservative. If they are conservative they have no right to criticize the religious conservatism.
    The theory of Vedas and the Bhagavath Gita never contradicts the perception and therefore the logic of atheists becomes the basis of the spiritual knowledge. The Lord comes in human form and this human form is perceived by the naked eyes. Even the miracles performed by demons establish the existence of super power. Therefore to convince the atheists the miracles of the Lord are not necessary. When they are convinced about the existence of the Super power (Maya), the possessor of the Super Power, the Lord, coming in human form must be also accepted because the form is seen by the naked eyes. The salvation is breakage of the bonds in this world. Since the bonds of this world exist based on the perception, the salvation is also existing based on the perception. Since the family members and the money are perceived by the eyes, the bonds with them are also perceived. Thus the salvation (Moksha) must be accepted by the atheists. A single bond with the human form of the Lord is called ‘Saayujya’ or ‘Kaivalya’. Since the human form is perceived, Sayujya or Kaivalya is also perceived and must be accepted by the atheists. The Bliss is derived by the devotee from the divine knowledge of the human form of the Lord. Therefore the Bliss is also true according to atheists. Thus the goal, the means to please the Lord (Sadhana) and the fruit of Sadhana (Moksha and Kaivalya) are perceived and exist in this world itself. Veda says ‘Yat SaakshatAparokshaat’, ‘Pratyagatmana Maikshat’ which mean that the Lord in human form is perceived by the naked eyes. Veda also says ‘Ihachet Avedeet’, which means that everything is true as seen in this world itself. This is called ‘Jeevanmukthi’, which means attaining the salvation while one is alive and not after death. The salvation after the death is not true because that has no basis of perception. Thus if the atheists are little bit patient and leave their aggressive nature of criticism, they are best fitted in the true spiritual knowledge of Vedas. In fact Swami Vidyaranya included the philosophy of Charvaka in his book as one of the logical philosophies (Darsanaas).
    At the lotus feet of Shri Dattaswami
    -Durgaprasad

    ReplyDelete
  3. Incarnation of God is the proof of existence of God.

    Pure awareness requires existence of 2 items. one is the energy obtained from the digestion of food and the second is nervous system, which alone can convert this inert energy to awareness. Thus awareness is dependent on two items. But, God is independent.

    Where is the role of human being in the conversion of inert energy to awareness? When a human being is not controlling processes in his own body, how can he be independent? We attribute it to God.

    the earth is not rotating by itself. Then why the fan is not rotating on its own. As the invisible current drives the fan, the invisible God is rotating the earth.

    in the parlysis, the limbs do not move inspite of intensive wish of the human being. This shows dependency.

    at lotus feet of swami
    surya

    ReplyDelete